పత్రికా ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, అమరావతి
తేదీ.5.10.2020.
***
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఎన్నికలు ఘనంగా ముగించుకొని ఏకగ్రీవంగా ఎన్నికైన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణ మూర్తి మరియు వారి సంఘ సభ్యులు (ప్యానల్) ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం గారిని అదేవిధంగా GAD సెక్రెటరీ శశిభూషన్ IAS గారిని, రెవిన్యూ సెక్రెటరీ శ్రీమతి. వి. ఉషా రాణి, IAS గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన సభ్యులను వారికి పరిచయం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బొప్పరాజు గారు మాట్లాడుతూ 4 సార్లు వరుసగా ఎలాంటి పోటీ లేకుండా unanimous ఎన్నిక చేయడం మా నాయకత్వం పై మరింత బాధ్యత, నమ్మకం ఉంచడం వలన మాపై ఉద్యోగులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా వంతు శక్తివంచన లేకుండా కృషి చేసి ప్రభుత్వానికి ఒప్పించి, మెప్పించి ఈ క్రింద తెలిపిన ప్రధాన సమస్యలపై పరిష్కారం కొరకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ అజయ్ కల్లం గారికి ఈ క్రింది అంశములను పరిష్కారం కొరకు విన్నవించడం జరిగింది.
1. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న DA బకాయిలను వెంటనే మంజూరు చేయాలని..
2. మార్చి మరియు ఏప్రిల్ మాసాలలో కరోనా కారనంగా నిలిపిన (అర్ధ) జీతాలను వెంటనే విడుదల చేయాలని..
3. 11వ PRC నివేదికను వెంటనే తెప్పించుకొని దానిని అమలు చేసి ఉద్యోగాలకు ఆనందం ఇవ్వాలని..
4. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులలో హెల్త్ కార్డులు పనిచేయక, రేయింబర్సుమెంట్ పధకం కొనసాగింపు ఉత్తర్వులు లేక ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పెన్షనర్లు తీవ్ర ఆవేదనకు గురై మానసికంగా, ఆర్ధికంగా చితికిపోతున్నందున ఈ విషయం వెంటనే పరిశీలించి వాటిపై సత్వర చర్యలు తీసుకుని ఉద్యోగుల్ని, పెన్షనర్లని ఆదుకోవాలని..
5. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేసి వారిని రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు జస్టిఫికేషన్ నివేదికతో సంబంధం లేకుండా వారికి జీతాలు పెండింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
అన్ని విషయాలను సానుకూలంగా విన్న ప్రధాన సలహాదారు గారు పై అంశాలను వెంటనే గౌ11ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలోAPRSA ప్రధాన కార్యదర్శి శ్రీ చేబ్రోలు కృష్ణమూర్తిగారు, రాష్ట్ర కోశాధికారి శ్రీ. వి. గిరి కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ. యన్. శ్రీనివాస్ గారు, సెక్రెటరీ. శ్రీ. కె. శ్రీనివాస శర్మ గారు, శ్రీ. ప్రవీణ్ రెడ్డి గారు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ. శ్రీ. Ch. V. రమణమూర్తి గారు, యస్. ప్రేమ్ కుమార్ గారు మరియు డ్రైవర్ల సంఘం అధ్యక్షులు శ్రీ. D. కొండయ్య గారు, కాంట్రాక్టు ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ. యస్. జాన్ హెన్రీ గారు పాల్గొన్నారు.

0 Comments
Thanks For Your Valuable Feed Back