PRESS NOTE
ఎపి జెఎసి అమరావతి
తేదీ. 19.09.2020
*****
★ అనారోగ్య హెల్త్ కార్డులవల్ల వైద్య సదుపాయం అందక ప్రాణాలను ఫణంగా పెడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు.... బొప్పరాజు, వై.వి.రావు.
★ రేయింబర్సుమెంట్ పధకాన్ని నిలిపివేయడం వలన, డబ్బులు చెల్లించినా.. కోవిడ్ మరియు ఇతర వ్యాధులకు సరైన వైద్యం అందక, ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి రాక.. కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు... బొప్పరాజు, వైవీ రావు.
★ ఎంప్లాయిస్
హెల్త్ స్కీమ్ కార్డులను నిరాకరిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు...
అప్పులుపాలౌతున్న ఉద్యోగులు,
పెన్షనర్లు... బొప్పరాజు,వైవీ రావు.
*****
కోవిడ్ వంటి విపత్కర
పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా విధి నిర్వహణ, సంక్లిష్ట ఆర్ధిక పరిస్థితుల మధ్య కుటుంబ రక్షణలకు సతమతమవుతున్న సగటు
ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి నెలా నెలసరి
చందా చెల్లిస్తూ కూడా వైద్య సహాయం అందక అప్పులుపాలవ్వడం,
మరికొందరు సరైన వైద్యం అందక మరణించడం దురదృష్టకరం అని, ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో ముందుండి ప్రజలకు సేవలందిస్తున్న ఏ
ప్రభుత్వ ఉద్యోగి ఇబ్బంది పడకుండా హెల్త్ కార్డు ద్వారా కోవిడ్ మరియు ఇతర వైద్య
సదుపాయాలు తక్షణం అందేలా చర్యలు తీసుకోవాలని.. అంతవరకు 31.7.2020 వరకు కొనసాగించిన రేయింబర్సుమెంట్ పధకాన్ని తిరిగి హెల్త్ కార్డ్ ద్వారా
పూర్తి స్థాయిలో వైద్యం అందేవరకు (1.8.2020 నుండి)
కొనసాగించాలని బొప్పరాజు మరియు వై.వి. రావు లు ప్రభుత్వాన్ని
కోరారు.
ఏపీ జేఏసీ అమరావతి తరఫున చైర్మన్
బొప్పరాజు మరియు సెక్రటరీ జనరల్ వై.వి.రావు లు ఉద్యోగుల వైద్య సదుపాయం విషయమై అనేక
వివరాలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయ ఉన్నతాధికారుల
దృష్టికి కూడా తీసుకువెళ్లారు.
◆ దశాబ్దాలుగా ఉద్యోగుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే
భరిస్తున్నప్పటికి,ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో సంప్రదించి
మరింత మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వ మరియు ఉద్యోగుల భాగస్వామ్యం తో (50:50)
ఏర్పాటు చేసుకొన్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పూర్తిగా విఫలమైందని
◆ గత 5 సంవత్సరాలుగా
ప్రభుత్వాలతో అనేక సార్లు సంప్రదింపులు జరిపినా, అనేక ఉత్తర్వులు ఇచ్చినా, ఇటీవల CEO, EHS ద్వారా నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేసినా ఎలాంటి
ప్రయోజనం లేదని..
◆ గత 6 సంవత్సరాల నుండి ప్రభుత్వ
ఉద్యోగులు/పెన్షనర్ల జీతాల నుండి నెలనెలా చందా చెల్లిస్తూ కూడా ప్రముఖ
ఆసుపత్రుల్లో EHS కార్డులపై వైద్యం అందక, తన జోబులో నుంచి వైద్యానికి సొంతగా హాస్పిటల్స్ కి డబ్బులు చెల్లించి
తిరిగి ప్రభుత్వం నుండి కేవలం 50% లోపే రేయింబర్సుమెంట్ కింద
పొందడం వలన ఉద్యోగులు ఈ 5 సంవత్సరాల కాలంలో కొన్ని కోట్లాది
రూపాయలు వారి సొంత డబ్బులు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ
రేయింబర్సుమెంట్ పధకాన్ని కూడా (31.7.2020 వరకే) నిలిపివేయడం
వలన, ఖర్చు పెట్టిన డబ్బులు కూడా తిరిగి ప్రభుత్వం నుండి
ఉద్యోగికి/పెన్షనర్ కి వచ్చే అవకాశం కూడా పోయింది.
◆ 2020 మార్చి నుండి ఈ పరిస్థితి మరింత దిగజారింది.
కోవిడ్ 19 పరిస్థితులను ఎదుర్కొనడానికి ఎపడమిక్ డీసీజస్ చట్ట
పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్
శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ప్రమాదకర పరిస్థితులలో పని చేయడం వలన
ఉద్యోగులతో పాటు ఉద్యోగుల కుటుంబాలు కూడా నేడు ప్రమాదంలో పడ్డాయి.
◆ ఈ పరిస్థితులలో అనేకమంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ఆసుపత్రులలో విషమ
పరిస్థితుల్లో వైద్యం పొందుతున్నారు.
◆ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నెట్వర్క్ (NABH) హాస్పిటల్స్ లో ప్రముఖ ఆసుపత్రుల
యాజమాన్యం EHS కార్డు అమలు చేయడాన్ని పూర్తిగా
తిరస్కరించడం/నిరాకరించడం వలన మరియు ప్రభుత్వం రియంబర్స్మెంట్ స్కిం కూడా నిలుపుదల
చెయ్యడం వలన వెరసి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పరిస్థితి అగమ్యగోచరంగా,
ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారనటంలో అతిశయోక్తి లేదు.
● కావున
ఉద్యోగుల, పెన్షనర్ల వైద్య సదుపాయం అంశాన్ని ప్రభుత్వం
అత్యవసరంగా గుర్తించి *గౌ|| ముఖ్యమంత్రి గారు తక్షణమే
కలుగచేసుకోవలని* ...
● ఈ
విషయమై ఉద్యోగులలో ఉన్న తీవ్ర అసంతృప్తిని , ఆవేదనను అర్ధం
చేసుకుని, రాష్ట్రంలో ఏ ఉద్యోగి ఒక్కరూపాయి కూడా అదనంగా
ఖర్చు చేయకుండా హెల్త్ కార్డు ద్వారా వైద్య సదుపాయం అందించాలని..
● *అట్లు
సాధ్యం కాని పక్షంలో తక్షణమే మేము చెల్లించే నెల వారి
చందా ను నిలుపుదల చేసి, గౌ|| ముఖ్యమంత్రి
గారే స్వయంగా ఉద్యోగ సంఘాలతో సమావేశమై దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను
అన్వేషించాలని AP JAC అమరావతి పక్షాన
గౌ||ముఖ్యమంత్రి గారిని
కోరుకుంటున్నాము.*
బొప్పరాజు మరియు వై.వి.రావు
0 Comments
Thanks For Your Valuable Feed Back