బొప్పరాజు గారి మాటల్లో

APNGO's రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత ఉద్యోగుల శ్రేయస్సు కొరకు, వారికి రావలసిన రాయితీల కొరకు పోరాటం చేస్తూ పోరాటం మధ్యలోనే అశువులుబాసిన కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి 19వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ రాష్ట్ర నాయకత్వం అలాగే ఏపీ జేఏసి అమరావతి రాష్ర నాయకత్వం నెల్లూరు పట్టణానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ. వారి ఆశయాలను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మరియు ఏపీజేఏసీ అమరావతి ఎప్పుడు కోనసాగిస్తుంది అని ఉద్యోగులకు రావలసిన రాయితీల కోసం అవసరమైతే పోరాటం చేసి తీరతామని తెలియజేస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కష్టపడి ఇంత పెద్ద కరోనా విపత్తులో కూడా ముందుండి ప్రైవేట్ హెల్త్ సెక్టార్ భయపడి ప్రక్కన ఉన్నాకూడా గవర్నమెంట్ సెక్టార్లో ప్రత్యేకంగా వైద్యులు అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ అదేవిధంగా నర్సులు అందరూ కూడా కష్టపడి అలాగే పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ ఇలా అన్ని శాఖలు ముందుండి ఈరోజు ఈ యొక్క విపత్తుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎదుర్కొంటుంది. అటువంటి ముందుండి పనిచేస్తున్న ఉద్యోగులకి రావలసిన రాయతీల గురించి మాకు రెగ్యులర్ రావలసిన జీతభత్యాల్లో ఏప్రిల్ మే నెలలో నిలిపివేసిన 15 రోజుల 15 రోజుల జీతం వెరసి నెల రోజుల జీతం వెంటనే చెల్లించాలని. 2018 జూలై నుంచి రావలసిన DAల బకాయిలలో కనీసం పాత మూడు బకాయిల DAలను అయినా చెల్లించడానికి ముఖ్యమంత్రివర్యులు చొరవ చూపి చెల్లించాలని, అదేవిధంగా PRC 11వ పిఆర్సి నివేదికకు ఇచ్చిన గడువు ఈనెలాఖరుకు పూర్తి అవుతున్న సందర్భంగా నివేదిక తెప్పించుకొని దానిని అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాము.



APRSA & APNGOs Association రాష్ట్రా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి 19వ వర్ధంతి సందర్భంగా విజయవాడ రెవెన్యూభవన్ నందు వారిని స్మరణకు తెచ్చుకుంటూ జరిగిన సంస్మరణ సభ.


దివంగత మహానేత కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా ప.గో జిల్లా  నందు జరిగిన సంస్మరణ సభ.... APRSA,ప. గో. జిల్లా.
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్ర రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి కీ:శే తోట సుధాకర్ ప్రసాద్ గారి 19 వ వర్ధంతి ని పురస్కరించుకుని కాంస్య విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పిస్తున్న ముఖ్య అతిధి ప్రకాశం జిల్లా DRO శ్రీ వినాయకం గారు, AP రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు AP JAC అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, AP JAC అమరావతి సెక్రెటరీ జెనరల్ వై వి రావు, APRSA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చేబ్రోలు కృష్ణ మూర్తి, కోశాధికారి శ్రీ V. గిరి కుమార్ రెడ్డి, జిల్లా APRSA కార్యదర్శి మరియు జిల్లా JAC చైర్మన్ శ్రీ RVS కృష్ణ మోహన్, అధ్యక్షుడు శ్రీ T. V. రావు తదితరులు....
APSRTC ప్రకాశం రీజియన్ యూనియన్ కార్యాలయంలో AP JAC అమరావతి ఛైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారిని సత్కరిస్తున్న APSRTC EU రాష్ట్ర కార్యదర్శి కె నాగేశ్వరరావు, రీజనల్ అధ్యక్ష కార్యదర్శి, ఒంగోలు డిపో నాయకులు. AP JAC అమరావతి సెక్రటరీ జనరల్ వై వి రావు గారిని, APRSA ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి గార్ని సత్కరిస్తున్న APSRTC ప్రకాశం రీజియన్ నాయకులు