LETS START ANOTHER INNINGS ..... APJAC 2.0
ఉద్యోగుల శ్రేయస్సే పరమావధిగా అనునిత్యం ఉద్యోగులకు అందుబాటులో ఉండే విధముగా ఉద్యోగుల పట్ల అంకితభావం అలాగే సేవాబావం కలిగిన వ్యక్తులచే నిర్మించబడినది మన ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటి (APJAC). దీనిలో బాగాస్వాములైన ప్రతిఒక్క నాయకుడు ఒక మహోజ్వలమైన శక్తి. అందువలననే APJAC స్థాపించిన అనతికాలం లోనే అందరి మన్ననలు పొందగలిగిన శక్తిగా మారింది. ఉద్యోగులకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఎవ్వరు ఏమి చేయలేరు అని APJAC అమరావతి స్థాపించిన తొలినాళ్ళలో కొంతమంది వ్యతిరేకించిన ఎవరు చేయకపోతే ఎలా మనం చేద్దాం ఫలితం అదే వస్తుంది అని ముందుకు వచ్చిన బొప్పరాజు - ఫణిరాజు లు సగర్వంగా APJAC అమరావతి పేరున వచ్చిన 65 GO లను పుస్తక రూపంలో అచ్చు వేసినప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగ ప్రపంచం సంబ్రమాశ్చర్యాలకు గురైంది.
కాలం మారింది సమీకరణాలు మారాయి పదవులు మారాయి రాష్ట్రంలో APJAC లో కూడాను అయినా సంకల్పం మాత్రం మారలేదు తపన తగ్గలేదు పదవుల కోసం కాదు ఉద్యోగుల శ్రేయస్సు కోసం అని మన నాయకులు నిరూపించారు. గతములో వున్న పరిస్థితులకు భిన్నంగా వుండ్తుంది అనుకున్నా ఉద్యోగులలో నివురుకప్పిన నిప్పుల వున్న అసంతృప్తి బగ్గున పగిలి ఏటువంటి అనర్ధానికి దారి తీయకుండా APJAC అమరావతి నడుం బిగించింది. అన్ని శక్తులను పదునేక్కించి సేవే మా మార్గం అని ముందుకు నడవడం మొదలు పెట్టింది...... APJAC 2.0.
రాష్ట్రంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి చేరువ అవ్వాలనే ఉద్దేశ్యముతో గత సార్వత్రిక ఎన్నికల సందర్భముగా అధ్యక్షుని ఆదేశాలమేరకు తాత్కాలికముగా నిలిపివేసిన ఈ చానాల్ మీ అందరి మనోవేదనను మరొక్కసారి గొంతువిప్పడానికి మరలా ప్రారంభించడం జరిగింది..... గమనించండి....
APJAC 2.0

0 Comments
Thanks For Your Valuable Feed Back