*ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో గుంటూరులో మహిళా దినోత్సవ వేడుకలు*
ఈ రోజు అనగా తేదీ 11.3.2020న జరిగిన ఈ సమావేశానికి ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్ శ్రీమతి బి. సుశీల అధ్యక్షత వహించగా సహకార శాఖ కమిషనర్ శ్రీమతి డా.జి.వాణిమోహన్ గారు, గుంటూరు జిల్లా కలెక్టర్ గారి సతీమణి శ్రీమతి ఐ. సుజాత గారు మరియు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు
ఈ సందర్భంగా శ్రీమతి వాణి మోహన్ గారు మాట్లాడుతూ మహిళలను వేరే వారు ప్రభావితం చేయకుండా మనకి మనమే స్వయంగా మార్పుకు నాంది పలికేలా మన ఆలోచనలు నడవడిక ఉండాలని, మహిళల పట్ల పురుషుల వైఖరిలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందని అవసరమైతే వారికి విధంగా కొన్ని శిక్షణ తరగతులు నిర్వహించాలని కోరారు.
బొప్పరాజు గారు మాట్లాడుతూ ఈరోజు మహిళలు రాణించని రంగం లేదని అంతరిక్షం నుండి రక్షణ వ్యవస్థ వరకూ అన్నింటా మహిళలు రాణిస్తున్నారని మహిళల పట్ల అసభ్యంగా అమానుషంగా ప్రవర్తించే వారి పట్ల అప్రమత్తంగా మెలగాలని, గౌ.ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే మొదటిగా స్త్రీ రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చి భారత దేశంలో నే ఆదర్శంగా మన గౌ11 ముఖ్యమంత్రి గారు నిలిచారని ఈ సందర్భంగా అందరూ మన గౌ11ముఖ్యమంత్రి గారిని మనసారా రాష్ట్ర మహిళలందరు అభినందించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, పురుషులలో ప్రత్యేకంగా యువతలో స్త్రీల పట్ల భావం మారాలని మహిళలను పూజించిన చోటే అభివృద్ధి ఉంటుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ గారు సతీమణి శ్రీమతి సుజాత గారు మాట్లాడుతూ వందలాది మంది మహిళలు మహిళా దినోత్సవం జరుపుకోడానికి రావడం చాలా ఆనందంగా ఉందని. మనం కూడా పిల్లల పెంపకంలో వారిని ధైర్యంగా ఉండేలా తీర్చిదిద్దాలని కోరారు.
సమావేశానికి ఏపీ జేఏసి అమరావతి రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ శ్రీమతి జయ సశ్యామల, కొ చైర్మన్ మెహరాజ్ సుల్తానా, వైస్ ఛైర్మన్ లు శ్రీమతి నాగమణి, అనుపమ, కోశాధికారి శ్రీమతి సుజాత, ఝాన్సీ ఇతర మహిళా నాయకురాలు లతో పాటు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు, కో చైర్మన్ శ్రీ ఆల్ఫ్రెడ్ గారు, జనకుల శ్రీనివాసరావు గారు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కిషోర్ కుమార్ గారు గుంటూరు జిల్లా ఏపీ జేఏసి అమరావతి చైర్మన్ కె సంగీతరావుగారు జనరల్ సెక్రెటరీ శ్రీనివాస శర్మ గారు సిటీ శాఖ చైర్మన్ కె కళాధర్ గారు జనరల్ సెక్రెటరీ శ్రీనివాసరావు గారు, ఎపిఎస్ ఆర్ టి సి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ హనుమంతరావు గారు, మహిళ నాయకురాలు శ్రీమతి O D లక్మి గారు తదితర నాయకులు ఆఫీసర్లు డాక్టర్లు హాజరైనారు
బొప్పరాజు మరియు వై.వి.రావు





0 Comments
Thanks For Your Valuable Feed Back