ఈరోజు కాకినాడ, శశికాంత్ నగర్ లో ఏపీ కోపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ భవనము నందు  ఏపీ జేఏసి అమరావతి తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షుడు శ్రీ పితాని త్రినాథరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశము మరియు ఆంధ్ర ప్రదేశ్ గెజిటెడ్ అధికారుల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆవిర్భావ సమావేశము జరిగినది.
ఈ సమావేశానికి ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ టి వి ఫణి పేర్రాజు, గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.వి. నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి కేశవ నాయుడు ముఖ్య అతిథులుగా  మరియు వివిధ డిపార్ట్మెంట్ సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బొప్ప రాజు గారు మాట్లాడుతూ గౌ. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ప్రధమ కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు సంబంధించి అనేక సానుకూల నిర్ణయాలు ప్రకటించారని, అయితే  అమలు లో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి మరియు ఈ క్రింద తెలిపిన కొన్ని ప్రధాన సమస్యలపై ప్రధాన సంఘాల యొక్క సలహాలు/సూచనలు తీసుకోవడం ద్వారా అధికార యంత్రాంగం సత్వరమే సదరు సమస్యలను పరిష్కారించ వచ్చునని అందుకుగాను గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించవలసిన రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వెంటనే నిర్వహించాలని కోరారు.


◆  ప్రభుత్వము మరియు ప్రభుత్వ ఉద్యోగులు / విశ్రాంత ఉద్యోగులు సమానంగా నిధులు చేకూర్చేలా ఏర్పాటుచేసిన ఉద్యోగుల హెల్త్ కార్డుల పధకం (ఎంప్లాయిస్ హెల్త్ స్కీం) క్రింద  చాలా సంవత్సరాల నుండి  ఉద్యోగుల వద్దనుండి కోట్లాది రూపాయల చందా వసూలు చేస్తున్నప్పటికీ, ఎంప్లాయిస్ హెల్త్ కార్డ్స్ ద్వారా వైద్య సదుపాయం ఇప్పటికీ అందడం లేదని ఈ విషయమై ఉద్యోగులందరిలో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉందని ఉద్యోగుల ఆరోగ్య పథకం యొక్క మేనేజ్మెంట్ కమిటీ సమావేశాల్లో స్టీరింగ్ కమిటీ సమావేశాల్లోనూ ఎన్నిసార్లు హెల్త్ కార్డు గురించి సవివరముగా వివరించినప్పటికీ నేటికి కూడా ఆరోగ్యకార్డులు ద్వారా పూర్తి వైద్య సదుపాయం అందకపోవడం విచారించదగ్గ విషయమని ప్రభుత్వము నుండి నెట్ వర్క్ హాస్పిటల్స్ కు చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించడం ద్వారా ను, క్రిటికల్ కేర్ కేసులలో చెల్లించవలసిన మొత్తములో network హాస్పిటల్స్ కు - డా11వైస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు మధ్య  నెలకొని ఉన్న అనిశ్చితిని తొలగించడం, దానికొరకు ఉద్యోగులు చెల్లించవలసిన చందాను అవసరమైన మేరకు పెంపుదల చేయడం  ద్వారా ఉద్యోగులకు హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో వెంటనే అమలయ్యేలా  చర్యలు తీసుకోవాల్సి ఉన్నదని,
★ అలాగే  APS RTC ని ప్రభుత్వం లో విలీనం చేసే ప్రక్రియలో సంబంధిత అధికారిక కార్మిక సంఘం "ఎంప్లాయిస్ యూనియన్" సలహాలు/సూచనలు తీసుకోవడం ద్వారా సత్వరమే చర్యలు చేపట్టాలని..

★  సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే ప్రక్రియలో ఉద్యోగ సంఘాల సూచనలు...

★ ప్రభుత్వము మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ నిమిత్తము కేవలం రెండు నెలలు మాత్రమే సెలవులు మంజూరు చేసి ఉన్నందున, కేంద్ర ప్రభుత్వము అనుమతించినట్లు గాను మరియు పదవ పిఆర్సి సిఫార్సు చేసిన విధంగానూ మహిళా ఉద్యోగులకు ఆరు నెలల పిల్లల సంరక్షణ నిమిత్తము సెలవులు మంజూరు చేయడం... అదే విధముగా మహిళా టీచర్లకు మంజూరు చేసిన విధముగానే మహిళా ఉద్యోగులందరికీ ప్రభుత్వము ఐదురోజుల ప్రత్యేక సెలవులు మంజూరు చేసినప్పటికీ ఇప్పటికీ అమలులోకి రాలేదని సత్వరమే వాటిని అమలు చేస్తూ ఉత్తర్వులు  జారీ చేయుటలో లాంటి అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అనేక సమస్య పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి అధ్యక్షతన ప్రధాన వేదిక అయిన "రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్" సమావేశాన్ని వెంటనే జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని AP JAC అమరావతి పక్షాన కొరదమైనది.

◆ అదేవిధంగా దాదాపు 20/25 సంవత్సరాల నుండి వారి వారి శాఖా పరమైన ఉద్యోగులకు సేవలందిస్తున్న దాదాపు 60 సంఘాలకు పైచిలుకు రాష్ట్రంలో గుర్తింపు కొరకు వేచి చూస్తున్నందున, వెంటనే రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్" సమావేశాన్ని జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని AP JAC అమరావతి పక్షాన కొరదమైనది.


ఈ సమావేశానికి ఏపీ ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి వి.వి మురళీకృష్ణ నాయుడు, కో చైర్మన్ జె శ్రీనివాసరావు, AP JAC అమరావతి రాష్ట్ర మహిళా విభాగం వైస్ చైర్మన్లు శ్రీమతి మెహారాజ్ సుల్తాన్, శ్రీమతి పద్మజ గార్లు, వైస్ చైర్మన్ డిజి ప్రసాదరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ బి కిషోర్ కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ వసంత రాయలు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు డి ఈశ్వర్ ఆర్ యు జిల్లా అధ్యక్షుడు కె సంగీతరావు అమరావతి సిటీ యూనిట్ చైర్మన్ కె కళాధర్, గెస్ట్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి వి కే వర్మ, విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి  పి వెంకటేశ్వరరావు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సి హెచ్ కృష్ణమూర్తి, పోలీస్ మినిస్టీరియల్ స్టాఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి చంద్రశేఖర్, విభిన్న ప్రతిభావంతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. సురేష్ నాల్గవ తరగతి ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశ్వర రావు తదితర నాయకులు హాజరయ్యారు.