అమరావతి: ఈ రోజు ఒంగోలు పట్టణములో జరిగిన కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ- అమరావతికి ప్రకాశంజిల్లా ఛైర్మెన్ గా  కృష్ణమోహన్ గారికి ఎన్నిక అయినారు, ఈ సందర్భముగా బొప్పర్జు గారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు కృష్ణమోహన్ గారు ఎన్నికకావడం శుభపరినామము అని తెలిపారు.
అలాగే ఆంధ్ర ప్రదేశ్ హోం గార్డ్స్ అసోసియేషన్ కు సంబంధించి ప్రకాశం జిల్లా కార్యవర్గాని ఈ రోజు APJACఅమరావతి చైర్మన్ బొప్పరాజు గారి సమక్షములో ఎన్నుకోవడము జరిగినది. ఈ సందర్బముగా జరిగిన ఒంగులులో జరిగిన కార్యక్రముములో ప్రకాశం జిల్లా హోం గార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ప్రకాశం జిల్లా కార్యవర్గ సమావేశం నూతన కార్యవర్గానికి  ఏపీ జేఏసి అమరావతి చైర్మన్ గౌరవనీయులు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర గారు ప్రమాణం చేపించారు. ఈ కార్యక్రమములో ప్రకాశం జిల్లా ఏపీ జేఏసి అమరావతి కార్యవర్గ సభ్యులు హాజరైనారు. 

ఈ సమావేశంలో  ఏపీ జేఏసి అమరావతి చైర్మన్  శ్రీ బొప్పారాజు వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి  మురళీకృష్ణ నాయుడు గారు, కో చైర్మన్ఆ ల్ఫ్రెడ్ గారు , కో చైర్మన్  శ్రీనివాస్ గారు, APJAC అమరావతికి  కొత్తగా ఎన్నుకోబడిన ప్రకాశం జిల్లా చైర్మన్ కృష్ణమోహన్ గారు,. ఏ.పీ .ఆర్ ఎస్. ఏ జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు  , డిస్టిక్ జెఏసి జాయింట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు  మరియు ఇతర సంఘాల నాయకులు సంఘ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు