ప్రాధమిక ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల సిబ్బందికి (PACS) HR పాలసీ
అమరావతి: ప్రాధమిక ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) HR పాలసీని ఆమోదించి ఆరు వేలు పైచిలుకు కుటుంబాలలో వెలుగు నింపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ‘ఏపి జెఏసి అమరావతి’ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఫణి పేర్రాజు ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సంఘం సంయుక్తంగా ఘన సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా బొప్పరాజు గారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో అత్యంత పెద్దదైన ఆర్థిక వ్యవస్థ సహకార పరపతి వ్యవస్థని రాష్ట్రంలో 22 లక్షల పైచిలుకు చిన్న సన్నకారు రైతులకు రుణాలు అందించే వ్యవస్థ ఇదొక్కటేనని ,అటువంటి పరపతి వ్యవస్థలో భాగస్వాములై నిత్యం రైతులకు సేవలు అందించే ఉద్యోగుల ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించి సమస్య పరిష్కారానికి తక్షణం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. వైద్యనాథన్ కమిటీ రివైవల్ ప్యాకేజ్ అమలు జరిపిన తర్వాత భారతదేశంలోనే తొలిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధముగా పిఎసిఎస్ ఉద్యోగులకు హెచ్ ఆర్ పాలసీ ఆమోదించడం ఒక చరిత్ర అని పేర్కోన్నారు. ఈ ఉత్తర్వుల వల్ల రాష్ట్రంలో పీఏసీఎస్ లలో పనిచేస్తున్న సుమారు 6000 ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని బొప్పరాజు తెలియజేశారు.
బొప్పరాజు వెంకటేశ్వర్లు తన దృష్టికి తెచ్చిన ఏ సమస్య పరిష్కారం చేయకుండా వదిలి పెట్టలేదని చంద్రబాబు చెప్పారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, సమస్య పరిష్కారాల మార్గాలు విశ్లేషించడం, సమస్య త్వరితగతిన పరిష్కారానికి పై నుంచి కింది స్ఠాయి వరకు అందరిని సమన్వయం చేసుకుంటూ తనకు కావలసినవి సాధించుకోవడం బొప్పరాజు ప్రత్యేకత అని, తనకు చెప్పితే సమసలు పరిష్కారం అయినట్లేనని, మీ బొప్పరాజు ఆదర్శ నాయకుడని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
పేర్రాజు మాట్లాడుతూ… ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి దొరక్కడం ఉద్యోగుల అదృష్టం అన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర సహకార వ్యవస్థలో PACS ఉద్యోగులకు HR పాలసీని ముఖ్యమంత్రి గారు ఆమోదించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉద్యోగులకు హెచ్ ఆర్ పాలసీ మరియు విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సేవల శాఖలో లో గత 30 సంవత్సరాలుగా కనీసం ప్రమోషన్ కూడా లేకుండా సర్వీసు చేస్తున్న సీనియర్ ఫైర్ మ్యాన్ ల సమస్యలు ఏపి జెఏసి అమరావతి దృష్టికి సంబందిత ఉద్యోగ సంఘాల నాయకులు తీసుకువచ్చిన తక్షణమే తాము ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి నెలల వ్యవధిలోనే సమస్యలను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయించడం జరిగిందన్నారు.
204 సీనియర్ ఫైర్ మాన్ పోస్టులను లీడింగ్ ఫైర్ మాన్ గా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి 30 సంవత్సరాల మా కలను నెరవేర్చినందుకు, ప్రాధమిక ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) HR పాలసీని ఆమోదించి ఆరు వేలు పైచిలుకు కుటుంబాలలో వెలుగు నింపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామని PACS సంఘ నాయకులు మరియు సిబ్బంది అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపి జెఏసి అమరావతి సెక్రెటరీ జనరల్ ఫణి పేర్రాజు , కృష్ణా జిల్లా చైర్మన్ ఈశ్వర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ రాజు, ప్రధాన కార్యదర్శి పి.సత్యనారాయణ మరియు కోశాధికారి టి.వెంకటరామయ్య మరియు ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

0 Comments
Thanks For Your Valuable Feed Back