లీడింగ్ ఫైర్ మాన్ గా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినందుకు ధన్యవాదాలు
అమరావతి: విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సేవల శాఖలో 204 సీనియర్ ఫైర్ మాన్ పోస్టులను లీడింగ్ ఫైర్ మాన్ గా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ‘ఏపి జెఏసి అమరావతి’ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఫణి పేర్రాజు ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణ , అగ్నిమాపక సేవల శాఖ ఉద్యోగుల అసోసియేషన్ ఘన సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కొద్ది నెలల ముందు వీరి సమస్యలను తీసుకురావడం జరిగిందన్నారు. ఆ వినతి మేరకు విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సేవల శాఖలో లో గత 30 సంవత్సరాలుగా కనీసం ప్రమోషన్ కూడా లేకుండా సర్వీసు చేస్తున్న సీనియర్ ఫైర్ మ్యాన్ ల కోసం 204 పోస్టులను లీడింగ్ ఫైర్ మాన్ గా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ముఖ్యమంత్రిగారు జారీ చేసారని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చిన ఏ సమస్య పరిష్కారం చేయకుండా వదిలి పెట్టలేదని బొప్పరాజుగారు చెప్పారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, సమస్య పరిష్కారాల మార్గాలు విశ్లేషించడం, సమస్య త్వరితగతిన పరిష్కారానికి పై నుంచి కింది స్ఠాయి వరకు అందరిని సమన్వయం చేసుకుంటూ తనకు కావలసినవి సాధించుకోవడం APJAC అమరావతి టీం యొక్క ప్రత్యేకత అని, సంఘం దృష్టికి వచ్చిన ప్రతి సమస్యా పరిష్కారానికి కృషి చేస్తామని బొప్పరాజు గారు తెలియ చేసారు.
ఫణి పేర్రాజు గారు మాట్లాడుతూ… ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి దొరక్కడం ఉద్యోగుల అదృష్టం అన్నారు. విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సేవల శాఖలో లో గత 30 సంవత్సరాలుగా కనీసం ప్రమోషన్ కూడా లేకుండా సర్వీసు చేస్తున్న సీనియర్ ఫైర్ మ్యాన్ ల కోసం 204 పోస్టులను లీడింగ్ ఫైర్ మాన్ గా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరమైన విషయమన్నారు. విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సేవల శాఖలో లో గత 30 సంవత్సరాలుగా కనీసం ప్రమోషన్ కూడా లేకుండా సర్వీసు చేస్తున్న సీనియర్ ఫైర్ మ్యాన్ ల సమస్యలు ఏపి జెఏసి అమరావతి దృష్టికి సంబందిత ఉద్యోగ సంఘాల నాయకులు తీసుకువచ్చిన తక్షణమే తాము ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి నెలల వ్యవధిలోనే సమస్యలను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయించడం జరిగిందన్నారు.
204 సీనియర్ ఫైర్ మాన్ పోస్టులను లీడింగ్ ఫైర్ మాన్ గా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి 30 సంవత్సరాల మా కలను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సేవల శాఖ నాయకులు సిబ్బంది హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపి జెఏసి అమరావతి సెక్రెటరీ జనరల్ ఫణి పేర్రాజు , కృష్ణా జిల్లా చైర్మన్ ఈశ్వర్, విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సేవల శాఖ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.ఆర్. నాయుడు మరియు ఎన్. కోటేశ్వరరావు మరియు వారి కార్యవర్గ సభ్యలు, ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.


0 Comments
Thanks For Your Valuable Feed Back