పెన్షన్ పెంపు ఉత్తర్వులు సాధించిన ‘బొప్పరాజు’కు కృతజ్ఞతలు : రిటైర్డు పార్ట్ టైం వి.ఆర్.ఓలు
_________________________________________________________________________________
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఒత్తిడి మేరకు గతంలో రాష్ట్రంలో పార్ట్ టైం విలేజ్ ఆఫీసర్లుగా, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా, పంచాయతీ సెక్రటరీలుగా, పార్ట్ టైం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లుగా గౌరవ వేతనంపై సేవలందించి పదవీ విరమణ చెందిన వారికి ప్రస్తుతం అందిస్తున్న రెండు వేల రూపాయల పెన్షను రెట్టింపు అంటే నాలుగు వేల రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ( G O.Ms.No.186, Revenue ser.III Dept, dt.22.2.2019 ) జారీచేసింది.
ప్రభుత్వం జారీ చేసిన ఈ జీఓ యంయస్ నెం 186 ఉత్తర్వులుపై ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్యక్షడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అంజి ప్రసాద రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ… గౌరవ వేతనంపై దాదాపు 40 సంవత్సరాల పాటు రెవెన్యూ శాఖకు సేవలు అందించి పదవీ విరమణ చెందిన పార్ట్ టైం విలేజ్ ఆఫీసర్లు, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు, పార్ట్ టైం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు కేవలం రెండు వేల రూపాయల చాలీచాలని పెన్షనుతో ఇబ్బందులు పడుతున్నారని “ఏపి జెఏసి అమరావతి” అభ్యర్ధనల మేరకు ఇటీవల అనేక శాఖలకు చెందిన క్రింది స్థాయి ఉద్యోగులకు ప్రభుత్వం జీత భత్యాలు పెంచి అందరూ ఉద్యోగులను ఆదుకున్న తీరులోనే వీరి పెన్షను పెంచి ఆదుకోవాలని “ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్” విన్నపం మేరకు వారి పెన్షను నాలుగు వేల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసి, వారి కుటుంబాలలో ఆనందాన్ని నింపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు , ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణ మూర్తి కు , సిసిఎల్ ఏ మరియు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆర్దిక కార్యదర్శి రవిచంద్రకు కృతజ్ఞతలు తెలియచేసారు.
పెన్షను పెంపుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెన్షను మెత్తాన్ని రెట్టింపు పెంపు ఉత్తర్వుల జారీకి విశేష కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్యక్షడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అంజి ప్రసాద రావు లకు రిటైర్డు పార్ట్ టైం వి ఆర్ ఓ సంఘం నాయకులు మూర్తి, నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియచేసారు. ఈ ఉత్తర్వులు వల్ల రాష్ట్రంలో దాదాపు ఆరు వేల రెండు వందల మంది లబ్ది పొందుతారని ఈ పెంపుతో సుమారుగా సంవత్సరానికి 15 కోట్లు ప్రభుత్వం పై అదనపు భారం పడనున్నదని అన్నారు.


0 Comments
Thanks For Your Valuable Feed Back