కోర్కెల సాధనకై గతములో చేసిన పోరాటుముల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వము గతములో ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు మరియు ఇప్పటికే చాలాకాలంగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి దాదాపు 12 రోజులు సహాయ నిరాకరణ ఉద్యమం చేసిన పంచాయతీరాజ్ ఇంజనీర్ల జేఏసికి మద్దతుగా ఏపీ జెఎసి చైర్మన్ బొప్పరాజు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సామరస్యంగా చర్చలు సఫలం అయిన సందర్భముగా ది. 25.02.2019న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించి సంబరాలు చేసుకున్నారు. పంచాయతీ రాజ్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు మురళీకృష నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జెఏసి సెక్రటరీ జనరల్ ఫణి పేర్రాజు, పంచాయతీ రాజ్ ఇంజినీర్ల సంఘం జనరల్ సెక్రటరీ సంగీతారావు , పంచాయతీ రాజ్ డిప్లమో ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రియాజ్, హనుమంతరావు మరియు టెక్నీకల్ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమయాజులు, సిటీ జెఏసి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాన్ హేన్రి బాబు తదితర నాయకులు పాల్గొన్నారు.
|
|
|




0 Comments
Thanks For Your Valuable Feed Back