Go.Ms.25 Finance ExGratia to Contract and Out Source Employees
ఎపి జెఎసి అమరావతి
తేదీ 18 2 2019
చనిపోయిన కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు గరిష్టంగా 5 లక్షలు రూపాయిలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ఉత్తర్వులు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. .. బొప్పరాజు
ఏపీ జేఏసి అమరావతి అనేక దఫాలుగా కాంట్రాక్ట్ ,NMR, పార్ట్ టైం ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగులు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కనీస సౌకర్యాల కొరకు ప్రభుత్వానికి విన్నవించిన మీదట వాటిలో కొన్ని డిమాండ్ లను అంగీకరించిన ప్రభుత్వము వాటిని పరిష్కరించడంలో భాగంగా ఈరోజు చనిపోయిన కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు గరిష్టంగా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఉత్తర్వులు ( GO Ms.25. తేదీ.18.02.19 ఫైనాన్స్ డిపార్ట్మెంట్) జారీ చేయడమైనది.
ఈ సందర్భంగా బొప్పరాజు గారు మాట్లాడుతూ ప్రభుత్వము చిన్న స్థాయి ఉద్యోగులపై సానుకూలతను కొనసాగిస్తూ ఏపీ జెఏసి అమరావతి తరఫున విన్నవించిన విధముగా చనిపోయిన కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని,
కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైనా సాధారణంగా చనిపోయిన పక్షంలో వారికి రెండు లక్షల రూపాయలు మరియు ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆ ఉద్యోగి చనిపోయిన 15 రోజుల్లోగా చెల్లించే విధంగా స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వము ఈ జీవో ద్వారా ఇచ్చినదని
ఈ సదుపాయము 2 లక్షల50 వేల మంది చిరు ఉద్యోగుల కుటుంబాలకు భద్రత మరియు భరోసా కల్పిస్తుందని అందుచే ఆయా ఉద్యోగులందరూ ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు ముఖ్యమంత్రి గారిని జీవితకాలం గుర్తుంచుకుంటారని తెలియజేశారు.
బొప్పరాజు మరియు ఫణి


0 Comments
Thanks For Your Valuable Feed Back