ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యెక హోదా కావాలి - APJAC అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ రావు గారితో కలిసి ఏపీ జెఏసి అమరావతి పక్షాన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ జెఏసి అమరావతి చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకు రావటం వలన అనేక రాయితీలు వస్తాయని అందులో ఉద్యోగస్తులకు సంబంధించి కావాల్సిన పొందటానికి మా వంతు కృషిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకురావడానికి ఏపీ జెఏసి అమరావతి పక్షాన కృషిచేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్బముగా APJAC అమరావతి రాష్ట్ర కార్యాలయము నుండి అల్లూరి సీతారామరాజు వంతెన వరకు ఉద్యోగ సంఘాలతో బైక్ ర్యాలి నిర్వహించారు. ![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |










0 Comments
Thanks For Your Valuable Feed Back