*:AP JAC AMARAVATHI:*

*👉ది. 30. 01. 2019 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరియు విభజన హామీల అమలుపై వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ మరియు ప్రజా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్న పార్లమెంటు సమావేశాల కాలములో కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా శ్రీ చలసాని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అన్ని వర్గాలతో “ప్రత్యేక హోదా మరియు విభజన హామీల సాధన ఐక్య కార్యాచరణ వేదిక” ఏర్పాటు చేయడమైనది.*

*👉ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక హోదా మరియు విభజన హామీల సాధన JAC నందు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు, వివిధ సేక్టార్ల సంభందించిన నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు సభ్యులుగా వున్నారు.*

 *👉ఈ రోజు 01.02.2019న శ్రీ. చలసాని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో విజయవాడ గొల్లపూడి లోని CCLA కార్యలయం, డైరెక్టర్ హెల్త్ కార్యాలయం సిబ్బందితో కలసి   ప్రత్యేక హోదా సాధన సమితి  "ఆంధ్ర ప్రదేశ్ బంద్" నకు ఏపీ జేఏసి అమరావతి పాల్గొన్నది. ప్రతి ఉద్యోగి 'బ్లాక్ బాడ్జ్ లు' ధరించి, ఈ కార్యక్రమానికి పూర్తి సంఘీభావం తెలియచేస్తూ, బంద్  విజయవంతం కావడానికి ఉద్యోగ, ఉపాధ్యాయ,  కార్మిక మరియు విశ్రాంత ఉద్యోగులందరు సహకరించారు *


*-బొప్పరాజు వెంకటేశ్వర్లు*
*చైర్మన్;T.V.ఫణి పేర్రాజు*
*సేక్రేటరి జనరల్.*