ఈరోజు బొప్పరాజు గారి సారధ్యంలో సెక్రెటరీ జనరల్ ఫణి పేర్రాజు ట్రెజరర్ మురళీకృష్ణ నాయుడు, D.ఈశ్వర్ మరియు ఏపీ జేఏసి అమరావతి రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కలిసి,  ఉద్యోగులకు  ఇండ్ల స్థలములు కేటాయింపు, హెల్త్ కార్డుల అమలు, ఇంటర్మ్ రిలీఫ్ (IR),  కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్ డైలీ వేజస్, పార్ట్ టైం ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగులకు సంబంధించిన అంశములు, ప్రభుత్వ వాహనముల కొనుగోలు నాల్గవ తరగతి ఉద్యోగుల కు పదవీ విరమణ వయసు పెంపుదల తదితర అనేక విషయాలు సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా బొప్పరాజు గారు మాట్లాడుతూ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ముఖ్యమంత్రి గారు తగినంత సమయం కేటాయించి ఉద్యోగాల విషయాలు చర్చించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు


● ఉద్యోగులకు ఐఆర్ తో పాటు ఇళ్ల స్థలముల కేటాయింపులకు  ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని కోరి ఉన్నారు.

● ఆదేవిధముగా ఎంప్లాయిస్ హెల్త్ కార్డులు పూర్తి స్థాయి అమలుకు ముఖ్యమంత్రి గారు  ప్రత్యేకముగా దృష్టి సారించాలని కోరినారు.

● కాంట్రాక్టు ఉద్యోగులకు సాధారణ సెలవులు మంజూరు చేయాలని మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ఎంప్లాయిస్ హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని చనిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరి ఉన్నారు.


● 25.11.1993 ముందు సర్వీస్ లో చేరిన NMR, దినసరి వేతన part time full time contingent ఉద్యోగుల సర్వీస్ లను క్రమబద్దీకరించాలని , వారికి సాధారణ సెలవలు మంజూరు చేయాలని, ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని, ఉద్యోగి చనిపోయిన పక్షంలో కారుణ్య నియామకాలు కల్పించాలని అట్లు నియామకానికి అర్హత లేని పక్షంలో 15 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు.


● పొరుగు సేవల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలని, కనీస వేతనం 25000/- చెల్లించాలని వారికి సాధారణ సెలవులు మంజూరు చేయాలని, ఇతర సౌకర్యాలు కలగజేయాలని కోరారు.

● గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న విజయవాడ, విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ లలో పనిచేసే ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతభత్యాలు చెల్లించాలని కోరారు.


● ముఖ్యమంత్రి గారి చొరవతో విశ్రాంత ఉద్యోగులకు 70 సంవత్సరాలు నిండిన వెంటనే 10 శాతం అదనపు పెన్షన్ మంజూరు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నందున ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆల్ఫ్రెడ్ గారు మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెఏసి నాయకత్వం తో పాటు సీఎం గారిని కలిసి ధన్యవాదాలు తెలియజేస్తూ రాత్రింబవళ్లు మీరు ప్రజల కోసం కష్టపడుతున్నారు.. *మీలాంటి అనుభవం గల వారు "మళ్ళీ మీరే ముఖ్యమంత్రి గా రావాలి" అని* మా ఆయుష్షు కూడా మీరే తీసుకుని ఇంకా ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. ఆలాగే వారు ఏర్పాటు  చేసుకొనబోయే మహాజన సభ కు ముఖ్యఅతిథిగా  హాజరుకావాలని ఆహ్వానించి ఉన్నారు.

● అదే విధముగా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు కొండయ్య మరియు వారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేఏసి అమరావతి నాయకత్వం తో పాటు ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రభుత్వ డ్రైవర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని,  ఎలక్ట్రికల్ కార్లు  ప్రోత్సహిస్తున్న ప్రభుత్వము, వాటిని సొంతంగా  కొనాలని విన్నవించుకున్నారు.

వీటిపై ముఖ్యమంత్రిగారు స్పందిస్తూ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల విషయంలో మా ప్రభుత్వం సానుకూలంగానే వ్యవహరిస్తుందని నా దృష్టికి తీసుకొని వచ్చిన విషయాలలో అనేకమైనవి చిన్న ఉద్యోగులకు సంభందించినవి అని, వీటిపై సానుకూలమైన నిర్ణయాలు తీసుకొంటామని  తెలుయచేస్తూ..వెంటనే ఆర్ధికమంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు గారిని వాటిపై అవకాశం ఉన్నంతవరకు, వీలైనంత వరకు త్వరలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి ఏపీ జేఏసి అమరావతి సెక్రటరీ జనరల్ ఫణి పేర్రాజు , ట్రెజరర్ మురళీకృష్ణ నాయుడు, కొచైర్మన్ లు ఆల్ఫ్రెడ్, కొండయ్య, గెజిటెడ్ అధికారులు సంఘం జనరల్ సెక్రెటరీ జేశవ నాయుడు, ఎపి జెఏసి అమరావతి కృష్ణా జిల్లా చైర్మన్ డి. ఈశ్వర్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు సంగీతారావు, కాట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జాన్ హేన్రి బాబు, తాత్కాలిక ఉద్యోగుల జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు సురేష్, పొరుగుసేవల ఉద్యోగుల జెఎసి అధ్యక్షుడు దయాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.