పత్రికా ప్రకటన
(AP JAC అమరావతి, తేదీ.18.12.2017)
***
రాష్ట్రంలో దివ్యంగులైన (వికలాంగులు) దాదాపు 7000 మందికి వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో 3% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరియు తేదీ 19.10.2011 నుండే అమలులోకి తెస్తూ నేడు ప్రభుత్వం ఉత్తర్వులు G.O.Ms.No.188 GA(Ser.D)Dept. తేదీ 18.12.17న మంజూరు చేసారు. గతంలోనే ప్రభుత్వం స్త్రీ, శిశు, దివ్యంగులు మరియు వయో వృద్ధులు శాఖ ద్వారా (Women, Child, Disabled & Senior Citizen Dept) 3% రిజర్వేషన్లు కల్పిస్తూ GO No.42 తేదీ 19.10.2011 జారీ చేసినప్పటికీ.. AP State & Subordinate Service Rules 1996 కు సవరణ చేయనందువలన వివిధ శాఖలలో ఆమలు కాలేదు. నేడు సదరు సర్వీస్ రూల్స్ కు సవరణ చేస్తూ 100 points లలో 6,31,56 స్థానాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందున తప్పనిసరిగా అన్ని శాఖలలో 3% రిజర్వేషన్లు (Visually Handicapped-1%: Hearing Handicapped-1%: Ortho Handicapped-1%) అమలు పరచి తీరాలి.
నేడు పదోన్నతులు లో 3% రిజర్వేషన్లు
APJAC అమరావతి ఏర్పడిన ఈ 5 మాసాల నుండి ఇదే అంశముపై అందరి ఉన్నతాధికారులు ను కలిసి ఇప్పటివరకు జరిగిన అన్యాయాన్ని, జాప్యాన్ని.. అన్ని విషయాలను తెలియచేసి ఈ రోజు ఉత్తర్వులు మంజూరుకు కృషిచేయడం జరిగింది. AP JAC అమరావతి విజ్ఞప్తి మేరకు గౌ11 ముఖ్యమంత్రి గారు ఈ ఉత్తర్వులు విడుదల విడుదల చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాము. అయితే 1996 నుండి కేంద్ర ప్రభుత్వం దివ్యగులకు ప్రమోషన్లలో 3%రిజర్వేషన్ ఇస్తునందున రాష్ట్ర ప్రభుత్వం కూడా 2011 నుండి కాకుండా అప్పటి నుండే అనగా 1996 నుండి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో మాకు పూర్తిగా సహకారాన్ని అందించిన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ G. కోటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము.
బొప్పారాజు - ఛైర్మన్
ఫణి పేర్రాజు- సెక్రెటరీ జనరల్
G. హనుమంతరావు-వైస్ చైర్మన్ మరియు అధ్యకులు, AP దివ్యంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం.


0 Comments
Thanks For Your Valuable Feed Back