ఎయిడెడ్ కాలేజిలలో పనిచేస్తున్న సిబ్బందికి ఎంప్లాయిస్  హెల్త్ కార్డులు స్కీమ్  అమలుచేయాలి మరియు  కాట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ జారీచేసిన ఉత్తర్వులకు లోబడి వెంటనే పెంచాలి ... బొప్పరాజు
 
ఈరోజు తేదీ 02.12.17 న కడప పట్టణంలో ఎయిడెడ్ జూనియర్ కాలేజీ అధ్యాపకుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఎయిడెడ్ డిగ్రీ కాలేజీ అధ్యాపకుల , ఎయిడెడ్ గ్రంథాలయ ఉద్యోగుల , ఎయిడెడ్ వ్యాయమ అధ్యాపకుల మరియు ఓకేషనల్ కాలేజీల సిబ్బంది రాష్ట్ర సంఘాలన్నియు కలసి ఏర్పాటు చేసిన సమావేశములో ఎయిడెడ్ జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు దామోదరరెడ్డి గారు మరియు జనరల్ సెక్రటరీ హరించంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ రాష్రం ఉన్న పరిస్థితులలో  ఎయిడెడ్ కాలేజీల సిబ్బందికి పదవీవిరమణ సమయములో 300 రోజుల ఆర్థిక మరియు అర్ధ వేతన సెలవలు నగదుగా మార్చుకునే ఉత్తర్వులు  ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 6000 మందికి పైగా ఉన్న ఎయిడెడ్ అధ్యాపక మరియు అధ్యతాపాకేతర సిబ్బంది అందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియచేసుయున్నారు.
 ఈ సమావేశములో బొప్పరాజు గారు మాట్లాడుతూ ఎయిడెడ్ కాలేజీ సిబ్బందికి అర్ధవేతనం సెలవులు నగదుగా మార్చుకునే ఉత్తర్వులు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసారు. అంతేకాక అనేక ఇతర విషయాలు మాట్లాడుతూ

** ఎయిడెడ్ కాలేజిలలో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంప్లాయిస్  హెల్త్ కార్డులు స్కీమ్  అమలుచేయాలి

** కాట్రాక్ట్ కంటింజెంట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

** కాట్రాక్ట్ ఉద్యోగులకు 50% జీతాలు పెంచమని GO. No.95 ద్వారా ఎప్రియల్ 2017 లొనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ
 ఇప్పటికి అమలుకాకపోవడం పై వివిధ శాఖలలో ఉద్యోగులకు ముఖ్యముగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాట్రాక్ ఉద్యోగులకు తీవ్రఅన్యాయం జరుగుతున్నదని, ప్రభుత్వ ఉద్యోగులకు PRC అమలు చేసి నాలుగు సవత్సరములైన సమాన స్థాయిలో పనిచేస్తూ అతి తక్కుకే స్థాయిలో జితములు పొందుతున్న కాట్రాక్టు ఉద్యోగుల విషయంలో  అలసత్వం ప్రదర్శించడంపై అసహనం వ్యక్తం చేశారు . వారి జీతాలను వెంటనే పెంచాలని మరియు సుప్రీంకోర్టు ఉత్తర్వులు లోబడి వారిని పర్మినేట్ చెయ్యాలని కోరారు.

** ప్రభుత్వ శాఖలలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని స్వాగతిస్తూ, క్షేత్ర స్ధాయిలో పని చేస్తున్న అనేక శాఖల ఉద్యోగులకు ప్రస్థుతమున్న పరిస్థితులలో గ్రామాలలో డిజిటల్ మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యేవరకు e office సాఫ్టువేరు లో ఉన్న tour సదుపాయం వినియోగించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ విషయమై జిల్లాలలో అధికారుల వత్తిడి ఎక్కువగా ఉండటం తో ఉద్యోగులు తీవ్రమైన మానసిక వత్తిడికి అనుభవించడంతో
పాటు, ముఖ్యముగా మహిళ ఉద్యోగులు ప్రమాదాలకు లోనవుతున్నారు.
** ఈ మధ్యకాలం లో కొన్ని పత్రికలలో  ఖజానా శాఖ లో వ్యవస్థీకృతమైన లోపాలను మరియు కొంతమంది ఉద్యోగుల వలన జరిగిన తప్పులను మొత్తం డిపార్ట్మెంట్ కి, డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగులందరికి అపాదిస్తూ కొన్ని పత్రికలలో
 సిరియల్ గా  వ్యతిరేక కధనాలు రావడం జరిగినది. పత్రికా సోదరులు గమనినచవలసిన విషయమేమిటంటే  ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను ఉద్యోగస్థులుగా అమలుపరచడం మా భాద్యత కొన్ని కాలానుగుణంగా జరిగేమార్పులనుబట్టి ప్రభుత్వం నిర్ణయాలు మార్చుకొంటే వాటినే అమలుపరుస్తాము. కానీ ప్రభుత్వ విధానాలవలన, పనివత్తిడివలన , కొంతమంది ఉద్యోగులవలన జరుగుతున్న తప్పులను దయచేసి సంభదిత శాఖ మొత్తానికి మరియు ఆశాఖలోని ఉద్యోగులందరికి ఆపాదించడం వలన ప్రభుత్వానికి చెడ్డపేరు రావడమే కాకుండా ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతిని ఉద్యోగుల పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉందని గమనించగలరు. ఈ సమావేశములో APJAC AMARAVATI సెక్రటరీ జనరల్
ఫణి పేర్రాజు, కో ఛైర్మన్లు నారాయణరెడ్డి, రవి కుమార్ , రమేశ్  కుమార్, జిల్లా JAC ఛైర్మన్ జమాల్ రెడ్డి తదితరులు పాల్గొని ఉద్యోగుల సమస్యలపై మాట్లాడియున్నారు.