ఏపీ జేఏసీ అమరావతి వినతిమేరకు
"ఉద్యోగుల సమస్య లు పరిష్కారం కొరకు "నెలలో ఒకరోజు ఉద్యోగుల ఫిర్యాదుల దినం"
ఏపీ జేఏసీ అమరావతి ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు ప్రతి జిల్లాలో Joint Staff Council (సంయుక్త సిబ్బంది మండలి సమావేశం) ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అది ఆలస్యమైన పక్షంలో ఆయా జిల్లా కలెక్టర్లు నెలకొకసారి గుర్తింపు పొందిన ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ లతో కలిపి "ఉద్యోగుల గ్రీవెన్స్ డే " నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించాలని ఈ రోజు ప్రభుత్వం మెమో నెం.24037/SW/A1/2017-1 dt.19.9.17 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా చైర్మన్ బొప్పరాజు గారు మాట్లాడుతూ ఈ విషయంలో మా విజ్ఞప్తిని మన్నించిన శ్రీ దినేష్ కుమార్,IAS గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి ఉన్నారు. ఈరోజు ఈ మెమో ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న 10 లక్షలమంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు విశ్రాంత ఉద్యోగుల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవడమే కాకుండా, ఉద్యోగులు కోర్టులు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. దయచేసి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల AP JAC Amaravati చైర్మన్/ప్రధాన కార్యదర్శి లు అన్ని గుర్తింపు గల సంఘాలును కలుపుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ మీ జిల్లా కలెక్టర్ గార్లను కలిసి సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని బొప్పరాజు కోరారు.
ఈ మేమో రావడం ఉద్యోగలోకం అందరికి సంతోషకరం......ఫణి


0 Comments
Thanks For Your Valuable Feed Back