శుభోదయం.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లోని ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మిక మరియు విశ్రాంత ఉద్యోగుల కొరకు అవిశ్రాంతంగా కృషిచేసి చివరకు ఉద్యోగుల సంక్షేమం కోసం పోరాడుతూనే అసువులు బాసిన మన కా. తోట సుధాకర్ ప్రసాద్ గారి వర్ధంతి గత సంవత్సరం వరకు APRSA పక్షాన మాత్రమే నిర్వహిస్తుండగా, మన JAC కార్యవర్గ తీర్మానం ప్రకారము
ప్రతి సంవత్సరం సెప్టెంబరు 27 వ తేదిన కామ్రేడ్ తోట సుధాకర ప్రసాద్ గారి వర్ధంతిని ప్రతి జిల్లాలోనూ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయము మీకందరికీ విధితమే.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం రేపు తిరుపతి పట్టణంలో కా. M. నరసింహులు నాయుడు మరియు M. విజయసింహరెడ్డి గార్ల నాయకత్వంలో జరగబోయే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇంకొక సంతోషకరమైన విషయం కా. తోట సుధాకర్ ప్రసాద్ గారి సతీమణి మరియు వారి కుమారులు రేపటి తిరుపతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
కావున ఏపీ చేసి అమరావతి జిల్లా చైర్మన్ మరియు జనరల్ సెక్రటరీలు ఆయా జిల్లాలలో ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ సంఘాల రాష్ట్ర మరియు జిల్లా సంఘ నాయకులు అందరూ కలిసి రెవెన్యూ సంఘం సహకారంతో ఈ కార్యక్రమమును క్రమశిక్షణతో విజయవంతంగా నిర్వహించాలని సూచించడమైనది.
బొప్పరాజు మరియు ఫణి


0 Comments
Thanks For Your Valuable Feed Back