ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల కేంద్ర సంఘానికి జరిగిన ఎన్నికలలో కడప జిల్లాకు చెందిన డి.ఎస్. కొండయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ సంఘ ఎన్నికల అధికారి శ్రీ టి.వి.ఫణి పేర్రాజు ప్రకటించారు.
సంఘానికి జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఇప్పటి వరకు అధ్యక్షుడు గా పనిచేసిన జి. శ్రీరాములు, గుంటూరుకు చెందిన గురవయ్య కూడా పోటీచేసినప్పటికి , సంఘానికి ఎలక్షన్ పరిశీలకులుగా ఉన్న APJAC AMARAVATI చైర్మన్, బొప్పరాజు రాజుగారు మరియు ఎలక్షన్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో పోటీదారులు నాయకులు కలసి చర్చించుకుని సంఘ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఏకగ్రీవం చేసుకోవలని నిర్ణయిచుకొని. కడప జిల్లాకు చెందిన డి.ఎస్.కొండయ్యను రాష్ట్ర అధ్యక్షుడు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భముగా డ్రైవర్ ల సంఘానికి క్రొత్తగా అధ్యక్షుడు గా ఎన్నికైన కొండయ్య మాట్లాడుతూ మా సంఘ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా కావడానికి సహకరించిన APJAC AMARAVATI చైర్మన్ బొప్పరాజు గారికి , మరియు ఎలక్షన్ ఆఫీసర్ ఫణి పేర్రాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ చేశారు. అంతేకాక డ్రైవర్ల సమస్యల పరిష్కారం పై చిత్తశుద్ధి తో పనిచేస్తానని తెలియచేస్తూ, APJAC అమరావతి చేసే ప్రతి కార్యక్రమములలో డ్రైవర్ల సంఘం కలసి పనిచేస్తుందని తెలియ చేశారు.
0 Comments
Thanks For Your Valuable Feed Back