బొప్పరాజు గారి ఆధ్వర్యంలో AP రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్, కైకాల గోపాలరావు గారి అధ్యక్షతన రాష్ట్ర గ్రామ సహాయకులు సంఘం ప్రతినిధులు ఉపముఖ్యమంత్రి మరియు రెవెన్యూశాఖ మంత్రి వర్యుల శ్రీ కె.యి.కృష్ణమూర్తి గారిని కలసి  రాష్ర్టంలో రెవెన్యూశాఖ లో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రస్తుతము చెల్లిస్తున్న గౌరవవేతనం రూ.6000/- నుండి 10500/- పెంచమని , మరియు టి.ఏ. ప్రస్తుతం చెలిస్తున్న 100/- నుండి 200/-  లకు మరియు డి.ఏ. 200/- మరియు 300/- లకు పెంచాలని కొరియున్నారు. మంత్రిగారు సానుకూలంగా స్పందించి పైల్ ఆమోదించి ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నట్లు తెలియచేసారు.