10వ PRC ని తేదీ.28.2.2013 నియమించి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నందున , తేదీ 1.7.2018 నుండి 11వ PRC అమలులోకి రావలసి ఉంది. అయితే ఆనవాయితీ ప్రకారము ప్రతి PRC తరువాత అందులో వచ్చిన వివిధ శాఖల లో వివిధ cadre లలో జీత భత్యాలలో ఏమైనా తేడాలు ఉంటే వాటిని పరిశీలించి సరిదిద్దుటకు "అనామలి కమిటీ" నియమించేవారు. కానీ 10వ PRC తర్వాత ఎలాంటి అనామలి కమిటీ నియమించనందున అనేక వినతులు పరిష్కరించబడక (రాష్ట్ర విభజన తదితర పరిణామాలు వలన) అలాగే ఉండిపోయినవి. కాబట్టి 11వ PRC ని వెంటనే నియమించాలని నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీయుతులు దినేష్ కుమార్, IAS గారికి రిప్రజంటేషన్ సమర్పించిన APJAC AMARAVATI ఛైర్మన్ బొప్పరాజు బృందం.





0 Comments
Thanks For Your Valuable Feed Back