అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఇపుడు 50 ఏళ్లకే ఉద్యోగులను ఉద్యోగ బాధ్యతల నుంచి బలవంతంగా రిటైర్‌ చేయించే నిర్ణయాన్ని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం దారుణమైందని, ఇప్పటికే ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందన్నారు. పదిమంది పనిని ఒక్క ఉద్యోగి చేస్తున్నారని, అలాంటప్పుడు పనితీరును ఎలా లెక్కగడతారని బొప్పరాజు ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం...