ఈ రోజు  భారత ఉపరాష్ట్రపతి  అభ్యర్థి గా ఎన్నికకాబడిన వెంకయ్య నాయుడు గారికి ఉపాధ్యాయల ఏకీకృత సర్వీస్ రూల్స్ ఆమోదింప చేసినందుకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల JAC ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా సన్మానించారు.  రాష్ట్ర మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ గారు, ప్రత్తిపాటి పుల్లారావుగారు ,ఎంపీ. హరిబాబు గారు, అందరూ టీచర్ల ఎం. ఎల్.సి.లు ఉపాధ్యాయ మరియు ఉద్యోగ సంఘాలు హాజరైన  ఈ సభకి APJAC AMARAVATI తరపున చైర్మన్ బొప్పరాజు గారు సెక్రటరీ జనరల్ ఫణి పేర్రాజు గారు మరియు కార్యవర్గ సభ్యులు అతిధులుగా హాజరై ఉన్నారు.ఈ సభలో బొప్పరాజు గారు మాట్లాడుతూ విలువలతో కూడిన  వెంకయ్య నాయుడు గారి జీవితం గురించి వివరించి, గతంలో ఏ పదవిని ఆయన కోరుకోలేదని పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయని కారణం ఆయన క్రమశిక్షణ/అంకితభావంతో పనిచేయడం మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల సమర్థుడు ఈ రోజు ఉపరాష్ట్రపతి గా ఎన్నికకాబోతున్నందుకు అభినందనలు తెలియచేస్తూ భవిష్యత్ లో ఖచ్చితంగా గతంలో సర్వేపల్లి/V. V. గిరి గార్లు మాదిరిగానే వీరుకుడా భారత రాష్ట్రపతి పదవి చేపడతారని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారని తెలియచేశారు. AP JAC అమరావతి పక్షాన డ్రైవర్ల సంఘ నాయకులు శ్రీరాములు,labour dept కిశోర్, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల ఛైర్మన్లు ఈశ్వర్, సంగీత రావు గార్ల సమక్షంలో బొప్పరాజు, ఫణి గార్లు గౌశ్రీ వెంకయ్యనాయుడు గారిని ఘనంగా సన్మానించారు.
బొప్పరాజు&ఫణి.