CPS ఉద్యోగులకు గ్రాట్యుటీ & ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చినందుకు *ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. నారా. చంద్రబాబునాయుడు గారికి కృతజ్ఞతలు.....
13 సంవత్సరాలుగా సాధించలేనిది ఈ రోజు ఎలా సాధ్యమైంది....
దీనికి నేను రెండు విషయాలు చెప్పదలిచాను...
మొదటి విషయం
👉🏻 2004 తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న హక్కులను CPS భూతం లాగేసుకుంది.
👉🏻12 సంవత్సరాలుగా తోటి ఉద్యోగుల మరణం, వారి కుటుంబాలు రోడ్డున పడటం చూసిన CPS ఉద్యోగుల కడుపులు తరుక్కుపోయాయి.
👉🏻సాంప్రదాయ సంఘాలను అడిగితే మీకు ఏమి రాయితీలు రావు అని చెప్పడమే కాకుండా కొంతమంది హేళనగా మాట్లాడారు....
👉🏻దీనితో కడుపు మండిపోయన CPS ఉద్యోగులు సింగిల్ అజెండా తో ఒక అసోసియేషన్ స్థాపించారు. అదే APCPSEA
👉🏻 APCPSEA రాష్ట్రం లో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన CPS ఉద్యోగులను ఏకం చేయడం సఫలం అయింది.
👉🏻లెక్కకు మించిన అవగాహన సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది.
👉🏻 ప్రతీజిల్లాలో వేల సంఖ్యలో CPS ఉద్యోగులతో ర్యాలీలు, సభలు నిర్వహింహింది
👉🏻 ఈ ర్యాలీలు, సభలు నిర్వహించడానికి అవసరమైన ఆర్థిక వనరులను CPS ఉద్యోగులు వారి జీతాల నుండి తీసి APCPSEA కి బాసటగా నిలబడ్డారు.
👉🏻 అప్పుడు ఉన్న సాంప్రదాయ సంఘాలను, అప్పుడు ఉన్న JAC ని అయ్యా మా బాధ ఇది అని అడిగితే CPS పై పోరాటం తగదని, సంతకం పెట్టి వచ్చారని హేళన చేశారు.( కొంత మంది సానుకూలంగా స్పందించారు)
👉🏻 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నభూతో నభవిష్యత్ అనే విధంగా APCPSEA సెప్టెంబరు 1 న 16 వేల మంది CPS ఉద్యోగులతో ర్యాలీ, సభ నిర్వహించంది.
👉🏻 ఈ విధంగా జిల్లాల్లో, రాష్ట్రం లో ఎన్నో విధాలుగా చేసినా ప్రభుత్వం దగ్గరికి మా బాధ వెళ్ళలేకపోయింది.
👉🏻 ప్రభుత్వానికి మా బాధలను తీసుకెళ్ళల్సిన పెద్ద నాయకులు విఫలం అయ్యారు.
👉🏻 ప్రభుత్వానికి, APCPSEA మధ్యవారధి లేక కొట్టుమిట్టడున్నది.
ఇంతవరకు ఒక అంకం.
ఇకపోతే రెండో విషయం
👉🏻 APJAC అమరావతి ఆవిర్భవించిన తరువాత APCPSEA కాకినాడ మహాసభలో వేల మంది ఉద్యోగుల నడుమ మొదటి డిమాండ్ గా cps రద్దు అంశాన్ని ప్రకటించింది.
👉🏻 మొదటి డిమాండ్ గా ప్రకటించడం మాత్రమే కాదు దానిపై ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి సానుకూల దృక్పథం తో తీసుకురావడం లో విజయం సాధించింది
👉🏻 APJAC అమరావతి అనేక మంది క్యాబినెట్ మంత్రుల దగ్గరికి APCPSEA నాయకులని తీసుకొని వెళ్ళి కలసి రిప్రజంటేషన్లు ఇచ్చి, వారికి ఇందులో ఉన్న అంశాలను పూర్తిగా వివరించింది.
👉🏻 ప్రభుత్వ ముఖ్య ఉన్నతాధికారులను కలసి వారికి వివరించింది.
👉🏻 కనీసం CPS సమస్యను సెక్రెటరియేట్ గేట్ దగ్గరకి కూడా తీసుకు వెళ్ళని నాయకులను చూసిన APCPSEA కి APJAC అమరావతి ఒక వారధిలా కనిపించింది.
👉🏻 అప్పటి వరకు ఎవరిని నమ్మే స్థితిలో లేని APCPSEA నాయకులకు APJAC అమరావతి ఒక నమ్మకాన్ని కలిగించింది
👉🏻 ఎవరెన్ని ఆటంకాలు కల్పించాలి అని చూసినా APCPSEA అమరావతి JAC పక్షాన గట్టిగా నిలబడింది
👉🏻 APJAC అమరావతి లో ఉన్న 84 సభ్య సంఘాల మద్దతుతో ఛైర్మన్ శ్రీ.బొప్పరాజు. వెంకటేశ్వర్లు గారు, సెక్రెటరీ జనరల్ శ్రీ. ఫణి పేర్రాజు గారు కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగారు..
👉🏻 "గ్రాట్యూటీ & ఫ్యామిలీ పెన్షన్ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చింది అమరావతి JAC.
👉🏻 ఈ సంధర్భం లో అమరావతి JAC దూకుడుని చూసిన కొంత మందికి హఠాత్తుగా పోరాటాలు గుర్తుకువచ్చాయి.
👉🏻 తప్పనిసరిగా అవి కూడా సెక్రెటరియేట్ బాట పట్టాయి...
👉🏻 గ్రాట్యూటీ & ఫ్యామిలీ పెన్షన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి ని అమరావతి JAC కల్పించింది. (ఎలక్షన్లు ఏమి లేని సమయంలో GO లు ఇవ్వడమే దీనికి నిదర్శనం)
👉🏻 పై రెండు విషయాల వలన ఈ రోజు రాష్ట్రం లో ఉన్న 1,80,000 వేల CPS ఉద్యోగులకు మేలు చేసే "గ్రాట్యుటీ" (దేశం లో రెండో రాష్ట్రం AP), ఫ్యామిలీ పెన్షన్ (దేశం లోనే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్) GO లు లభించాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు.
👉🏻 మరి ఇంత మంచి పనికి పూనుకొని దానిని సాధించిన APJAC అమరావతి కి రెండు చేతులెత్తి CPS ఉద్యోగుల తరపున నమస్కరిస్తున్నాను....🙏🏻🙏🏻🙏🏻


0 Comments
Thanks For Your Valuable Feed Back