ఈ నెల 6న ఏపీ ఎన్డీవోస్ఏపీ జేఎసీ తలపెట్టబోయే ధర్నాలకు ఏపి జేఏసి అమరావతి కు ఎలాంటి సంబంధం లేదని ఏపి జేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.. తమ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఏపీ జేఎసీ ధర్నాల పేరుతో ఉద్యోగులను రెచ్చగొడుతోందన్నారు.. ఏపీ రాజధానిలో ఉండే ఏపి జేఏసి అమరావతికి , ధర్నాకు పిలుపునిచ్చిన జేఎసీ కి సంబంధం లేదన్నారు. ఏపీ ఎన్జీవోస్ పక్షాన ఉండే కొన్ని సంఘాలు మాత్రమే ధర్నాకు పిలుపునిచ్చాయన్నారు. తమ పరిధిలో ఉండే 75 శాఖలు, వాటిలో ఉండే రాష్ట నాయకత్వానికి ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధం లేదన్నారు. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా, వారి సమస్యలను పరిష్కరించేందుకు అమరావతి ఎన్జీవోస్ నిరంతరం పనిచేస్తోందన్నారు.. మరో రెండు నెలలో అమరావతి ఎన్జీవోస్ పూర్తిగా బలోపేతం అవుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ పణి, కో చైర్మన్ యోగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ గిరిధర్ రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కే విజయ్ బాబు, కేశవ నాయుడు, పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments
Thanks For Your Valuable Feed Back