NGO Assn JAC ఈరోజు ఇచ్చిన ప్రెస్ నోట్ ఇది. మన JAC చేసిన ప్రయత్నాలతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్న CPS గ్రాట్యుటీ, హెల్త్ కార్డ్స్,అడిషనల్ క్యాంటం ఆఫ్ పెన్షన్ మొదలగు వాటిపై ధర్నా పెట్టి ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్న నాయకత్వాలను ఏమనాలి???

ఇందులో కొత్త ఏముంది.... వారి అలవాటు అదే కదా మూడు ఏళ్ళు గా లేని ఉద్యోగ సమస్యలు ఇప్పటికిప్పుడు ఎందుకు గుర్తుకొచ్చాయను కుంటున్నారు? వారు నిజంగా సమస్యల కోసమే ధర్నా పెట్టారనుకుంటే పప్పులో కాలేసినట్లే.
నాకు అర్థమైన రెండు విషయాలు.

1. వారి ప్రధాన "టార్గెట్" మన JAC చైర్మన్ "బొప్పరాజు" గారు.

ఎందుకంటే మన చైర్మన్ సమస్య ఉందంటే దాని కోసం నిద్రపోడు, మనల్ని పోనివ్వడు. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో CPS ఉద్యోగులకు "గ్రాట్యుటీ & ఫ్యామిలీ పెన్షన్ "విషయం లో చిన్న సంధిగ్థత నెలకొన్న విషయం కనుక్కొన్న మన చైర్మన్ గారు APCPSEA నాయకులను వెంటబెట్టుకొని ముఖ్యమంత్రి గారి ప్రధాన ఉన్నతాధికారలను సంప్రదించి చర్చించి సంధిగ్థతను తొలగించారు.


అదేవిధంగా 5గురు క్యాబినెట్ మినిస్టర్స్ ను కలసి గ్రాట్యూటీ కొరకు సానుకూలతను తీసుకురావడం లో విజయం సాధించారు. ఉన్నతాధికారులు, క్యాబినెట్ మినిస్టర్స్ దగ్గర తరువాత క్యాబినెట్ లో ఖచ్చితంగా గ్రాట్యుటీ వచ్చే విధంగా గట్టి హామీ తీసుకురాగలిగారు. నిద్రాహారాలు మాని 3 రోజులు అదే పనిగా వర్క్ చేశారు. ఇప్పుడు GO రావడానికి అంతా సిద్దంగా ఉంది.

"AP JAC అమరావతికి" ఎక్కడ పేరొస్తుందో అని ఇప్పుడు వాళ్ళు ధర్నాకు దిగి ఇది మావళ్ళనే ఈ GO వచ్చింది అని చెప్పుకోడానికి ఈ పని చేశారు. రాష్ట్రం లో లక్షా డెబ్బై వేల మందికి తెలుసు ఎవరు వర్క్ చేశారో....                        
2. "ఉద్యోగులలో వారి ఉనికిని కాపాడుకోవడానికి."

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక్క టీచర్స్ (ఎడ్యుకేషన్) డిపార్ట్‌మెంట్ లో 52 రిజిస్టర్ అయిన సంఘాలు, 4 గవర్నమెంట్ రికగ్నైజేషన్ కలిగిన సంఘాలు ఉన్నాయి. 2008 DSC హామిపత్రాల టీచర్స్ (షుమారు 3000 వేల మంది పైనే ఉంటారు)  సమస్య గత 5 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకుపోగా  ఆ సంఘాల నాయకులు ఎప్పటికప్పుడు వారిని మభ్యపెడుతూ వచ్చారు. వారు వివిధ జిల్లాల నుండి వచ్చి బొప్పరాజు & ఫణి గార్లను కలసి తమ సమస్యను చెప్పుకున్నారు. వారందరిని తీసుకొని సెక్రెటరియేట్ కి తీసుకెళ్ళారు. అక్కడికి టీచర్స్ సంఘాలు చెప్తున్న రెండు ఫైల్ నంబర్లు తీసుకొని వచ్చిన హామీ పత్ర టీచర్స్  అక్కడి విషయాలు చూసి "నివ్వెరపోయారు" 

తీసుకొచ్చిన రెండు ఫైల్  నంబర్లలో ఒకటి "ఎన్నో రోజుల నుండి మీ ఫైల్ సెక్రెటరియేట్ లో ఉంది. త్వరలోనే మీ సమస్య పరిష్కారం అవుతుంది" అని సంఘ నాయకులు, సంబంధిత MLC లు చెప్తున్న ఫైల్ క్లోజ్ అయ్యి 2 సంవత్సరాలైంది. రెండోది  పట్టించుకోక, అడగక ఫైల్ "పార్కింగ్ ప్లేస్" కి వెళ్ళింది. ఫైల్ నంబర్ కూడా మారింది. త్వరలోనే అది కూడ క్లోజ్ అవుతుందంట. అప్పుడు బొప్పరాజు గారు అక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడి మరలా ఫైల్ మూవ్ చేయించారు... ఈ విషయం దగ్గరుండి స్వయంగా కళ్ళతో చూసిన "2008 హామి పత్రాల టీచర్స్" అగ్గిమీద గుగ్గిలం అయ్యారు... మారిన ఫైల్ నంబర్ ఎవరికీ ఇవ్వము. ఇస్తే ఇప్పుడు క్యూ కట్టుకొని వచ్చి మేము చేశాం , మేము చేశాం అని చెప్తారు అని బొప్పరాజు గారితో అన్నప్పుడు ఆయన అన్న మాటలు ఇప్పటికీ నా చెవులలో మార్మోగుతున్నాయి.

"మీ సమస్య పరిష్కారం అవ్వాలి. అంతే కాని నాకు పేరు రావాలి అని కోరుకోవడం లేదు" అని చెప్పి "నిజమైన నాయకుడనిపించుకున్నారు" ఇన్ని రోజులు ఈ విషయం పై మభ్య పెట్టిన టీచర్స్ సంఘాల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ఇప్పుడేమి చేయాలి. "పైగా జూన్ లో సభ్యత్వాలకి వెళ్ళాలి" ఇటు చూడబోతే గడచిన సంవత్సర కాలలో ఒక్క APCPSEA తప్ప ఎవరు సమస్యలపై రోడ్డెక్కలేదు ఏదో ఒకటి అరా తప్ప. పైగా ఊక్క APCPSEAలోనే 40% మంది టీచర్స్ (షుమారు డెబ్బై వేలు)ఉన్నారు. NGO లు 50% ఉన్నారు. వీరందరికి పైన చెప్పిన రెండు సంఘటనలు అన్ని పూసగుచ్చినట్టు తెలుసు.


మరి ఇప్పుడు "వారి ఉనికిని కాపాడుకోవాలి" అంటే గ్రాట్యుటీ, హెల్త్ కార్డ్ లు etc, సిద్దంగా ఉన్న సమయం లో ఇది మనమే చేశాము అని చెప్పుకోడానికి వారు పన్నిన "కుతంత్రం." కుతంత్రం అని ఎందుకన్నానంటే వారికి గడచిన మూడు సంవత్సరాలలో ఉద్యోగుల సమస్యలు గుర్తుకు రాకపోవడం.

"డిల్లీ అన్న వాళ్ళు ఇప్పుడు గల్లీ లో తిరగడానికి సిద్దమవ్వడం"
ఒకవైపు "బొప్పరాజు" గారు అదేపనిగా సమస్యలై తిరగడం...


పై విషయాల వల్ల (మన వల్ల అంటే AP JAC అమరావతి వల్ల) వారు తప్పని సరిగా రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. అది కూడ మన ఘనతే.ఆ పరిస్థితి కూడా మనమే కలగజేశాము. 

ఇప్పుడు వారేమి చేసినా "అందరికీ ఏం జరిగిందో, ఏం జరుగుతోందో ఉద్యోగులందరికీ తెలుసు."