ఏ పి జె ఏ సి- అమరావతి, అనంతపురం జిల్లా శాఖ తరపున  అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా  అధికారులతో సమన్వయం ఏర్పరుచుకొని ,ఆయా శాఖాపర ఉద్యోగుల సమస్యలు, ఇబ్బందులు, తదితర అంశాలను వారి దృష్టికి తీసుకెళ్ళి, పరిష్కారానికి కృషిచేయాలని అభ్యర్థన చేయాలనే నిర్ణయం నేపధ్యంలో, ఈ రోజు Deputy Director, జిల్లా ఖజానాశాఖ, అనంతపురం వారిని కలవడం జరిగింది.  ముఖ్యంగా CPS ఉద్యోగుల అనగా కొత్త పెన్షను విధానము  క్రింద పని చేస్తూన్న ఉద్యోగుల నెలవారీ వారి వారి జీతంలో వారి వాటాగా జమచేస్తున్న చందా  వారి వ్యక్తిగత ఖాతాలకు జమ కావటం లేదని, మరియు ప్రభుత్వ వాటా కూడా వారి ఖాతాలకు సరిగ్గా జమకానందువల్ల, ఉద్యోగుల వ్యక్తిగత  పెన్షను ఖాతాలో ఎంత మొత్తము జమ అయిన వివరాలు తెలియక CPS ఉద్యోగులు ఆందోళన చెందుచున్నారని తెలపడమైనది. ఈ సమస్య పరిష్కారానికి తగు చర్యలు సత్వరంగా తీసుకోవాలని కోరడమైంది. DD గారు సానుకూలంగా స్పందిస్తూ, ఈ నెలలో జరుగుతున్న బదిలీల ప్రక్రియ ముగుసిన తరువాత జూన్ మొదటి వారంలో, జిల్లాలోని 17 మంది సబ్ ట్రెజరీ అధికారుల సమావేశం ఏర్పాటు  చేసి, ఆ సమావేశంలో జేఎసి నాయకులతో పాటు CPS ఉద్యోగుల నాయకులు అందరూ కలిసి చర్చించి, ఒక కార్యాచరణ కార్యక్రమంను రూపొందించి సమస్యలను పరిష్కరించడానికి తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. తరవాత jac ఆవిర్భావం గురించి తెలియజేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం లో వారి సహకారం కోరడం జరిగింది. ఈ విధంగా అన్ని శాఖల జిల్లా అధికారులను కలిసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి ఉద్యోగులందరికి AP JAC Amaravathi, జిల్లా శాఖ- అనంతపురం అందుబాటులో ఉంటుందని తెలియచేస్తున్నాము.

ఈ కార్యక్రమం లో జిల్లా jac చైర్మన్ శీలా జయరామప్ప, జనరల్ సెక్రటరీ ఫణిరాజ్, వైస్ చైర్మన్లు శంకరనారాయణ,
శ్రీమతి చాముండేశ్వరి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ డి.నీలకంఠ రెడ్డి, జి. రమేష్, శ్రీ పోతిరెడ్డి  పాల్గొన్నారు.మరియు CPS ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు యాదవ్ పాల్గొన్నారు.