ఏ పి జె ఏ సి- అమరావతి, అనంతపురం జిల్లా శాఖ తరపున  అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా  అధికారులతో సమన్వయం ఏర్పరుచుకొని ,ఆయా శాఖాపర ఉద్యోగుల సమస్యలు, ఇబ్బం
దులు, తదితర అంశాలను వారి దృష్టికి తీసుకెళ్ళి, పరిష్కారానికి కృషిచేయాలని అభ్యర్థన చేయాలనే నిర్ణయం నేపధ్యం
లో ఈ రోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని మరియు ప్రిన్సిపాల్, సర్వ జన ఆసుపత్రి అనంతపురం గారిని కలిసి ఉద్యోగుల మెడికల్ రేయింబర్సుమెంట్ బిల్లుల సత్వర పరిష్కారం,jac ఆవిర్భావం గురించి తెలియజేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం లో వారి సహకారం కోరడం జరిగింది. ఈ విధంగా అన్ని శాఖల జిల్లా అధికారులను కలిసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి ఉద్యోగులందరికి AP JAC Amaravathi, జిల్లా శాఖ- అనంతపురం అందుబాటులో ఉంటుందని తెలియచేస్తున్నాము.
ఈ కార్యక్రమం లో జిల్లా jac చైర్మన్ శీలా జయరామప్ప,జనరల్ సెక్రటరీ ఫణిరాజ్,వైస్ చైర్మన్ శ్రీమతి చాముండేశ్వరి,డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ డి.నీలకంఠ రెడ్డి,
శ్రీమతి శిరీష,జి. రమేష్,సెక్రెటరీలు డాక్టర్ తిరుపతి నాయుడు,శ్రీ గోపి కృష్ణ,శ్రీ పోతిరెడ్డి  పాల్గొన్నారు.